చిన్నారిపై హత్యాచారం..రేపిస్టుకు ఉరిశిక్ష

  • జూన్ 18న చిన్నారిని రేప్ చేసి చంపేసిన ప్రవీణ్
Praveen
Praveen

వరంగల్‌: తెలంగాణలోని వరంగల్ కు చెందిన 9 నెలల చిన్నారి శ్రీహితను అత్యాచారం చేసి చంపేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. చిన్నారిపై హత్యాచారం చేసిన ప్రవీణ్ ను దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. కేసును విచారించిన కోర్టు కేవలం 48 రోజుల్లోనే దోషికి మరణదండన విధించింది. ఈ ఏడాది జూన్ 18న తెల్లవారుజామున తల్లి పక్కనే నిద్రపోతున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు.

ఈ ఘటన ఇంటికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఈ సందర్భంగా నొప్పి భరించలేక చిన్నారి ఏడస్తుండటంతో గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణకు తానే ఈ నేరం చేశానని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాగా నేరం జరిగిన 53 రోజుల్లో తీర్పు వెలువరించడం ఓ చరిత్రాత్మకమైన తీర్పు అని వారు అంటున్నారు. ఈ తీర్పుపట్ల తెలంగాణ బార్‌ కౌన్సిల్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/news/national/: