చంద్రబాబు పై ఎర్రబెల్లి ఆగ్రహం

వరంగల్‌ : ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ రాష్ట్ర  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తివ్రస్థాయిలో మండిపడ్డారు . కెసిఆర్‌ తన కింద పనిచేశారంటూ బాబు వ్యాఖ్యల పై ఎర్రబెలి ఫైర్‌ ఆయ్యారు అని తెలిపారు.ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఖమేం కాదు.. చంద్రబాబే మా కింద పనిచేశారుగ అని అన్నారు. టీడీపీలో చంద్రబాబు కంటే ముందు నుంచే కేసీఆర్, తాను క్రియాశీలకంగా ఉన్నామని చెప్పారు. పార్టీలో చేరి చంద్రబాబు.. గ్రూపు రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేశారని విమర్శించారు. తమలాంటి వాళ్లను టీడీపీలో తొక్కిపెట్టారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించాలని చూసిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తున్నానని ఎర్రబెల్లి అన్నారు.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: