ఓటింగ్‌ సందర్భంగా నేడు, రేపు సెలవు

Voting
Voting

మేడ్చల్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈరోజు విద్యాసంస్థలకు, రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా. ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. 11వ తేదీన పోలింగ్ ఉన్నదని, జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అంతేకాక రేపు ఓటింగ్‌రోజు సెలవు ప్రకటించని సంస్థలపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్135(బీ) ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్‌ హెచ్చరించారు. 11వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/