లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు

CEO Rajath Kumar
CEO Rajath Kumar

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజత్‌కుమార్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అయితే 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 35 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడువేల టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది ఉంటారని నిజామాబాద్ కౌంటింగ్ కేంద్రంలో టేబుల్‌కు ఆరుగురు ఉంటారు. మల్కాజ్‌గిరిలో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 20వేల సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారు. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశాం. పోలింగ్ తరహాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌లలోని స్లిప్పులు లెక్కిస్తాం. లాటరీ తీసి ఐదు వీవీప్యాట్ యంత్రాలను ఎంపిక చేస్తాం. ఫలితాలకు సాధారణం కంటే 2 గంటలు అదనపు సమయం పట్టవచ్చు. సాయంత్రం లోపే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/