ఇంటర్‌ బోర్డు అక్రమాలపై కదం తొక్కిన కాంగ్రెస్‌

కలెక్టరేట్ల వద్ద ఆందోళన

Dharna At Inter Board
Dharna At Inter Board

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ కమిటి గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్దకు ఉదయం పదిగంటల నుంచే భారీ సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలతో కలెక్టరేట్ల ప్రాంగ ణాలను హోరెత్తించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సిద్దిపేటలో పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, వరంగల్‌లో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్దమాజీ ఎంపిలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులున్నారు.