ఇంటర్‌ అక్రమాలపై ఆగని నిరసనలు

ఇంటర్‌ వ్యవహారంలో మంత్రిని బర్తరఫ్‌ చేయాలి
ప్రగతిభవన్‌ ముట్డడికి జనసేన యత్నం
మినిస్టర్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన బిజెవైఎం

Dharna
Dharna

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అక్రమా లపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఇంటర్‌ బోర్డు దగ్గర ఐద్యా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రగతిభవన్‌ ముట్టడికి జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేసి.. అక్కడి నుం చి తరలించారు. అలాగే మినిస్టర్‌ క్వార్టర్స్‌ను బిజెవైఎం కార్యకర్తలు ముట్టడిం చారు. ఇంకోవైపు సచివాలయం ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు యత్నించారు. ఇదిలా ఉండగా.. నార్కట్‌పల్లిలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని అడ్డుకునేందుకు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాలకు దిగారు.

విద్యార్థి, యువజన సంఘాలతో సచివాలయ ముట్టడి

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల అక్రమా లు, అన్యాయాల విషయమై విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేసి, బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. దీన్ని పోలీస్‌లు అడ్డుకుని సచివాలయంలోనికి వెళ్లకుండా నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా గురువారం నాడు 30 మందిని అరెస్ట్‌ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉపముఖ్యమంత్రి టి రాజయ్యపై చిన్న అవినీతి ఆరోపణలు వస్తే ఆయనను పదవి నుండి తప్పించిన కేసీఆర్‌ ఇప్పుడు ఇంటర్‌ బోర్డు అక్రమాలకు సంబంధించి మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని, అధికారులను ఎందుకు బర్తరఫ్‌ చేయరని ప్రశ్నించారు. ఇంటర్‌ బోర్డు అవకతవకల వలన 20 మంది విద్యార్థులు ఆత్మహతయలు చేసుకున్నా కనీసం విచారం వ్యక్త చేయకపోవడం బాధాకరమన్నారు. ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాలని చెబుతుండగా, దాన్ని ఎత్తివేస్తామని సీఎం చెప్పడం వెనుక చీకటి కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు.
గ్లోబరినా సంస్థకు ఏ ఒప్పందం ద్వారా ఇంటర్‌ మార్కుల బాధ్యత అప్పగించారో తెలపాలని డిమాండ్‌ చేశారు. అలాగే గ్లొబరినా సంస్థ సిఇఒ రాజుకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రశిడెంట్‌ కేటీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధం ఏమిటో తెలపాలని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా ఇంటర్‌ బోర్డులో బదిలీల ప్రక్రియ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌స్వతిన్‌, అనిల్‌కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ ఆర్గనై జింగ్‌ సెక్రటరీ శంకర్‌తోపాటు శ్రీకాంత్‌, శ్రీమాన్‌, నరేష్‌, శ్రీను, లక్ష్మణ్‌, చైతన్య, ఆజాద్‌, సాహెల్‌, ప్రేమకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి
లేకుంటే రాజ్‌భవన్‌ ముట్టడి: సిపిఐ
ఇంటర్‌ బోర్డు అక్రమాల విషయంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వెంటనే జోక్యం చేసుకుని అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్రకార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహ హెచ్చరించారు. ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని, గ్లోబరీనా యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, సంస్థ గుర్తింపును రద్దు చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బోర్డు నిర్వాకం వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని, బాధ్యులైన అధికారులను శిక్షించే విషయంలో గవర్నర్‌ నిర్లక్ష్యంగా ఉండడం ఎంత వరకూ సమంజసమ న్నారు. మొత్తంగా ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని కోరారు. బోర్డు నిర్వాకంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ముఖ్యమంత్రి మొక్కుబడిగా స్పందించారని విమర్శించారు. ఉచితంగా జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌, రీ వాల్యువేషన్‌ చేసినంత మాత్రాన సరిపోదని, మొత్తం ఘటనకు బాధ్యులైన బోర్డు కార్యదర్శి, అధికారులను వెంటనే సస్పెండ్‌ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఎలాంటి అర్హత లేకున్నా, అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఎలా కాంట్రాక్టు ఇచ్చారని ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్‌ కళాశాలకు మేలు చేసేందుకే ఇంటర్‌ బోర్డు అధికారులు ఒక పధకం ప్రకారం అవకతవకలకు పాల్పడ్డారని, ఈవిషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాని ఆరోపించారు.