అంజన్న క్షేత్రంలో నేడు పెద్దజయంతి ఉత్సవం

kondagattu anjanna temple
kondagattu anjanna temple


హైదరాబాద్‌: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి ఆంజన్న భక్తులు బారులు తీరారు. అంజన్న దీక్ష తీసుకున్న భక్తులతో కొండగట్టు కొత్త శోభ సంతరించుకుంది. అంజన్న క్షేత్రంలో నేడు పెద్దజయంతి ఉత్సవం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి స్వాములు, భక్తులు తరలివస్తున్నారు. భద్రాద్రి సీతారామ చంద్ర ఆలయం నుంచి తీసుకువచ్చిన నూతన పట్టువస్త్రాలతో ఇవాళ స్వామి వారిని అలంకరించనున్నారు. ఇప్పటికే వేలాది మంది దీక్షాపరులు ఆంజనేయ స్వామి సన్నిధిలో మాల విరమణ చేసి ఇరుముడులు సమర్పించారు. తలనీలాలిచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/