బ్యానర్లను వెంటనే తొలగించాలి

dana kishore
dana kishore, GHMC commissioner

హైదరాబాద్‌: అమీర్‌పేట్‌ మైత్రివనంలో ఉన్న కోచింగ్‌ సెంటర్లకు సంబంధించిన బ్యానర్లను తొలగించాలని జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిషోర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఈ రోజు మైత్రివనం ఏరియాలో పర్యటించారు. ప్రమాదకరంగా ఉన్న బ్యానర్లు, బోర్డులు తొలగించాలని, ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైత్రివనంలోని పలు కోచింగ్‌ సెంటర్ల భవనాలలో అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలను జిహెచ్‌ఎంసి అధికారులు తనిఖీ చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/