వినియోగదారులకు హక్కులపై అవగాహన అవసరం:జస్టీస్‌ జైస్వాల్‌

సైఫాబాద్‌ : వినియోగదారుల చట్టాలు, కోర్టులు తమ పరిధిలో మాత్రమే పనిచేస్తాయని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఎప్పటికి మోసపోతూనే ఉంటారని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టీస్‌ ఎంఎస్‌కె జైప్వాల్‌ హెచ్చరించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్ఛిభౌలి స్టేడియం వద్ద ఆడ్వకేట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటి అండ్‌ అవేర్‌నెస్‌ (అశ్రా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంధీప్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన 10కె, 5కె, 2కె మారథాన్‌ను సినీ నటి సురభి ప్రారంభించిన సందర్భంగా జస్టీస్‌ ప్రసంగించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు అశ్రా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినంధనీయమని ఆయన కొనియాడారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. మారథాన్‌ కార్యక్రమంలో 1200 మంది పాల్గొన్నారని సందీప్‌ చెప్పారు.ఈ కార్యక్రమంలో జస్టీస్‌ మాధవరావు, బిసి కమిషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు, సభ్యుడు వి.కృష్ణమోహనరావు, సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్‌, అశ్రా జాతీయ అధ్యక్షుడు రతన్‌రాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాసిరెడ్డి, ఇప్పలపల్లి రమేష్‌, సి.నారాయణ, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

https://www.vaartha.com/telengana/మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: