కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లిపోయినయి

Guntakandla Jagadish Reddy copy
Guntakandla Jagadish Reddy

నల్లగొండ : నేడు దేవరకొండలో నియోజకవర్గస్థాయి టిఆర్‌ఎస్‌ ఆక్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశానికి హాజరైన జగదీషరెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్‌ ఎన్న్లి తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఆడ్రస్‌ ఉండదని అన్నారు,ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓ అసమర్థ నాయకుడు. కాంగ్రెస్‌లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు చెల్లని రూపాయే. కాంగ్రెస్‌ నాయకులు పదవుల కోసమే తాపత్రయ పడుతారు. నల్లగొండలో చెల్లని రూపాయి కోమటిరెడ్డి.. భువనగిరిలో ఎలా గెలుస్తాడు? కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లిపోయినయి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు. టీడీపీ అయితే పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసి పక్క రాష్ర్టానికి పోయింది. ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి :