కెటిఆర్‌తో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యె

Tandur MLA Pilot Rohit Reddy
Tandur MLA Pilot Rohit Reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో కాంగ్రెస్‌ తాండూర్‌ ఎమ్మెల్యె పైలట్‌ రోహిత్‌రెడ్డి ఈరోజు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అయితే టిఆర్‌ఎస్‌లో చేరతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు కెటిఆర్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యె రోహిత్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు సిద్ధమయ్యారు, ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో చర్చలు జరిపిన రోహిత్ రెడ్డి
కెటిఆర్‌తో భేటీ అయ్యారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/