టిఆర్‌ఎస్‌లోకి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యె!

trs
trs

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నుండి మరో ఎమ్మెల్యె టిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నాట్లు తెలుస్తుంది. అయితే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) త్వరలో కారెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. కాగా… నిన్నటినుంచి జగ్గారెడ్డి తన అనుచరులకు కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అంతేగాక ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లు తెలిసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/