ప్రజల తరఫున ముగ్గురు ఎంపీలం పోరాటం

revanth, venkatareddy, uttam
revanth, venkatareddy, uttam

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో ఘనంగా సత్కరించారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో లేనట్టుగా..పదహారు సీట్లు టిఆర్‌ఎస్‌ గెలుస్తామనే అహంకారంతో ఆ పార్టీ నేతలు వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవడంతోపాటు మరో రెండు స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల తరఫున ముగ్గురు ఎంపీలం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనని, రాహుల్‌ గాంధీ నాయకత్వంపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు.
మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..కేసిఆర్‌, హరీశ్‌రావు కుట్రలు చేసి తనను కొడంగల్‌లో ఓడించారని, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, టిఆర్‌ఎస్‌ నియంతృత్వానికి బుద్ది చెప్పాలనే కాంగ్రెస్‌, బిజెపిలకు ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను టిఆర్‌ఎస్‌ విస్మరించి అనైతికంగా వ్యవహరిస్తుందన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/