మృతుల కుంటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: నారాయణపేట జిల్లాలో మరికల్‌ మండలం తీలేరు గ్రామ వద్ద యెడ్యార్‌ తిప్పగుట్ట దగ్గర ఉపాధిహామీ పనుల్లో భాగంగామట్టి పెల్లలు విరిగి పడటంతో 10 మంది కూలీలు మృతి చెందారు. అయితే ఈవిషయంపై సిఎం కెసిఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/