కారు ప్రమాదంలో చిన్నారులకు గాయాలు

car accident
car accident


హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో రోడ్‌నంబర్‌-12లో రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos