14 నుండి 22వరకు బడ్జెట్ సమావేశాలు

TS Assembly
TS Assembly

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకు జరపాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బిఏసి) సమావేశమయ్యింది. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా ఈ సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీ వరకు సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ చర్చపై 15, 16వ తేదీన సిఎం కెసిఆర్ సమాధానం ఇస్తారని, ఈనెల 17వ తేదీ నుంచి పద్దులపై అసెంబ్లీలో చర్చ, 22వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని సమాచారం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/