తెలంగాణ పాటకు అంతర్జాతీయ అవార్డు

Best Theme Song Award
Best Theme Song Award

హైదరాబాద్‌: జపాన్‌ వరల్డ్స్‌ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా తెలంగాణ టూరిజం థీమ్‌ సాంగ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వరించింది. అయితే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటక రంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు. ఈ పాట దూలం సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సాంగ్ చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం డిపార్ట్‌మెంట్ ఎంతో సహకారం అందించిందని, అంతర్జాతీయ అవార్డు రావడం గొప్పగా ఉందని దూలం సత్యనారాయణ పేర్కొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/