రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

మరోమారు దక్కించుకున్న కొలన్ ఫ్యామిలీ

balapur ganesh
balapur ganesh

హైదరాబాద్‌: హైదరాబాద్, బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డూ ధర రూ. 16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం లడ్డూ ధర దాన్ని మించింది. రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారన్న సంగతి తెలిసిందే. చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ వేలం తొలిసారి 1994లో ప్రారంభమైంది.

అప్పడు కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో కొన్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత బాగా ప్రాచుర్యం పొందడంతో రెండో ఏడాదది ఏకంగా పది రెట్లు పెరిగి రూ. 4,500 వరకు వెళ్లింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షలకు చేరుకుంది. వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు.. ఆ తర్వాతి నుంచి బయటవారిని కూడా అనుమతిస్తున్నారు.

1994లో కొలను మోహన్ రెడ్డి రూ. 450, 1995లో కలను మోహన్ రెడ్డి రూ. 4,500, 1996లో కొలను క్రిష్ణా రెడ్డిరూ . 18,000, 1997లో కొలను క్రిష్ణా రెడ్డి రూ. 28,000, 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51,000, 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000, 2000లో కల్లెం అంజిరెడ్డి రూ. 66,000, 2001 జి. రఘునందన్ చారి రూ. 85,000, 2002లో కందాడ మాధవ రెడ్డి రూ. 1,05,000, 2003లో చిగిరింత బాల్ రెడ్డి రూ. 1,55,000, 2004లో కొలను మోహన్ రెడ్డి రూ.2,01,000, 2005లో ఇబ్రాం శేఖర్ రూ.2,08,000, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3,00,000, 2007లో జి. రఘునందన్ చారి రూ.4.15,000, 2008లో కొలను మోహన్ రెడ్డి రూ.5,07,000, 2009లో సరిత రూ.5,10,000, 2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ.5,35,000, 2011లో కొలను బ్రదర్స్ రూ.5,45,000, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ. 7,50,000, 2013లో తీగల క్రిష్ణారెడ్డి రూ. 9,26,000, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9,50,000, 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి రూ. 10,32,000, 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65,000, 2017 నాగం తిరుపతిరెడ్డి రూ. 15. 60 లక్షలు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/