అసదుద్దీన్‌ ఓవైసి నామినేషన్‌

asaduddin awaisi
asaduddin awaisi


హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న మాణిక్‌రావు కన్నన్‌కు నామినేషన్‌ పత్రాలను ఓవైసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2009లోనూ, 2014లోనూ హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్‌ ఓవైసి పోటీ చేసి గెలుపొందారు.
ఈ నెల 25వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.


తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/