కెసిఆర్‌ 16 సీట్లతో ప్రధాని కాగలడ?

Amit Shah
Amit Shah

హైదరాబాద్‌: బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శంషాబాద్‌లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆయన విమర్శించారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని టిఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కెసిఆర్‌ దేశ ప్రధాని కాగలుగుతారా?అని ప్రశ్నించారు. దేశం మొత్తం మోడి పేరే వినిపిస్తోందని, మోడి యే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇటు టిఆర్‌ఎస్‌ పైనా, అటు కాంగ్రెస్‌ పైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి బిజెపి కట్టుబడి ఉంది. హైదరాబాద్‌ మెట్రో కోసం కేంద్రం రూ.1600 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ వంటి కేంద్ర సంస్థలను మంజూరు చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఏం ఇచ్చారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/