2 నుంచి ఢిల్లీలో బోనాల ఉత్సవాలు

Simhavahini Mahankali Temple
Simhavahini Mahankali Temple

Hyderabad: లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 4వ తేదీ వరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 5వ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతి నర్సింగ్‌రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలని ఆయన ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలచారికి వినతిపత్రం అందజేశారు. సుమారు 300 మంది ఆలయ కమిటీ ప్రతినిధులు, కళాకారులు ఈ ఉత్సవాల కోసం ఢిల్లీ వెళ్తారని నర్సింగ్‌రావు తెలిపారు.