భ‌విష్య‌త్తు కాంగ్రెస్ పార్టీదేః ఉత్త‌మ్ కుమార్

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైద‌రాబాద్ః బుధ‌వారం మెదక్ జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబానికి తప్పా, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.