నగరంలో ఫర్నిచర్‌ గోడౌన్‌ దగ్ధం

fire accident
fire accident

బేగంబజార్‌: హైదరాబాద్‌లోని ఎంజె మార్కెట్‌ సమీపంలోని ఓ ఫర్నిచర్‌ గోడౌన్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో పరిసర కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని గౌలిగూడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సుమారు నాలుగు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని పేర్కొన్నారు. బేగంబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/