దేశపురోభివృద్ధే బిజెపి లక్ష్యం

laxman
laxman

విద్యానగర్‌, : పేదల సంక్షేమం, దేశపురోభివృద్ధికి బిజెపి అంకితభావంతో కృషి చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌ చెప్పారు. హమారా పరివార్‌ బిజెపి పరివార్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాంనగర్‌గుండు వద్ద ఉన్న పార్టీ నాయకుడు గౌరిశంకర్‌ నివాసంలో బిజెపి జెండావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మణ్‌ బిజెపి జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. పండిత్‌దీన్‌దయాల్‌ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలందరిని ఏకం చేసేందకు చేపట్టిన హమారా పరివార్‌ బిజెపి పరివార్‌ కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతుందన్నారు.ఏకాత్మ మానవతావాదమన్న పండిత్‌ సూక్తిని నిజం చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. దేశప్రగతి కోసం బిజెపి పటిష్టతకు కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలన్నారు. పేదల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరేలా పార్టీ కార్యకర్తలు చొరవచూపాలన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ బిజెపి విజయం ఖాయమని లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. పార్టీ గ్రేటర్‌ ఉపాధ్యక్షుడు కొండపల్లి మాధవ్‌, ఆర్‌.శేషసాయి, సాయికృష్ణయదవ్‌, కౌండిన్యప్రసాద్‌, జగదీష్‌గుప్త, రామస్వామి,ప్రసన్నలతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా పుల్వామాదాడిని ఖండిస్తు అమరజవాన్లకు కొవ్వత్తులు వెలిగించి లక్ష్మణ్‌ సహ బిజెపి నేతలు నివాళులర్పించారు.