తెలంగాణ భ‌వ‌న్‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జాప్ర‌తినిధులు భేటీ

telangana bhavan
telangana bhavan

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావుగౌడ్,తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసే అంశంపై సమావేశంలో నేతలు చర్చించారు.