తెలంగాణలో రెండోరోజు రాజ్‌నాథ్‌ ఎన్నికల ప్రచారం

Rajnath singh
Rajnath singh

హైదరాబాద్: తెలంగాణలో రెండోరోజు శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 12 గంటలకు వరంగల్‌, 2 గంటలకు నాగార్జున సాగర్‌లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 3 గంటలకు షాద్‌నగర్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాగా నిన్న ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు గొప్పగా చెప్పుకునే తెలంగాణలో 4,500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు. బిజెపి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయని, అయితే ఏపీ, తెలంగాణ మాత్రం కొట్లాటలతోనే సరిపెడుతున్నాయని ఆయన విమర్శించారు. రూ. 1.15 లక్షల కోట్ల నిధులు తెలంగాణకు కేంద్రం ఇస్తే ఏం చేశారని రాజ్‌నాథ్ ప్రశ్నించారు.