కేజి బంగారం, 30 కేజీల వెండి స్వాధీనం


సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇవాళ ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ ఫాం-6లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న కిలో బంగారం, 30 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బంగారాన్ని వ్యాపారి సుభాష్‌ వర్మకు చెందిన బంగారంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/