అస‌లు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ నోరుమెద‌ప‌రుః ఎంపీ అస‌దుద్దీన్

asaduddin
asaduddin

హైద‌రాబాద్ః దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ , హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అన్ని అంశాలపైనా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారుగానీ, అసలు సమస్యలపై మాత్రం ఆయన నోరుమెదపరని విమర్శించారు. రాజస్థాన్ లో అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని యావత్తు దేశం ఖండించిందని, ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ మోదీ మాత్రం స్పందించలేదని మండిపడ్డారు. యాభై సంవత్సరాలున్న వ్యక్తి లవ్ జిహాద్‌కు పాల్పడ్డాడనే ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం, ముస్లిం అన్న కారణంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.