అడిక్‌మెట్‌లో బస్తీవాసులతో భేటీ అయిన లక్ష్మణ్‌

LAXMAN
LAXMAN

విద్యానగర్‌ : అభివృద్ధి పనులను వేగవంతం చేసి మౌలిక వసతులు కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. కె. లక్ష్మణ్‌ అధికారులను కోరారు. గురువారం అడిక్‌మెట్‌ డివిజన్‌లోని పలు బస్తీలను బిజెపి నాయకులతో కలిసి లక్ష్మణ్‌ సందర్శించారు. వడ్డెరబస్తీ, నెబ్రస్కా హోటల్‌ ఎదురు వీధుల్లో పాదయాత్ర చేస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సదర్బం´గా మురుగునీటి లీకేజీలు, దెబ్బతిన్న రోడ్లు వంటి వాటిపై మహిళలు ఫిర్యాదులు చేశారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడ్జెట్‌తో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సజావుగా జరపాల్సిన బాధ్యత అధికారులపైన ఉందన్నారు. రాజకీయాలను అధిగమించి ప్రజలకు మెరుగైన వసతులు కలించేందుకు అందరూ కలిసిరావాలన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు. బిజెపి గ్రేటర్‌ ఉపాధ్యక్షుడు కొండపల్లి మాధవ్‌, డివిజన్‌ అధ్యక్షుడు సాయికృష్ణ యాదవ్‌, ఆర్‌. శేషసాయి కౌండిన్య ప్రసాద్‌, జగదీష్‌, ఎంసి మోహన్‌, బొట్టు శ్రీనివాస్‌, నాగరాజులతోపాటు పలువురు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.