కేంద్రం ఫై తెరాస వరి యుద్ధం : నేడు ప్రతి రైతు ఇంటి ఫై నల్ల జెండాలు ఎగురవేత

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మండలస్థాయి నిరసనలు , రహదారుల రాస్తారోకో , జిల్లాస్థాయి దీక్షలు చేపట్టగా..ఈరోజు ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో అన్ని పట్టణాలు, గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల సమయంలో చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్విట్ పెట్టారు,రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని.. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని.. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారని ఆగ్రహించారు.