దత్తాత్రేయను కలిసిన ఎర్రబెల్లి

మిఠాయి తినిపించి అభినందనలు

Bandaru Dattatreya- Errabelli Dayakar Rao
Bandaru Dattatreya- Errabelli Dayakar Rao

హైదరాబాద్‌: తెలంగాణ ముద్దుబిడ్డకు గవర్నర్‌ పదవి దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చే అంశమని, ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఈరోజు ఆయన ఇంట్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి సత్కరించిన అనంతరం మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయతో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/