బర్కత్‌పురలో యాదాద్రి భవన్‌ ప్రారంభం

yadadri bhavan
yadadri bhavan


హైదరాబాద్‌: బర్కత్‌పురలో యాదాద్రి భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. నేడు యాదాద్రి భవన్‌ ప్రారంభోత్సవం జరిగింది. యాదాద్రి ఆలయ సమాచారం కోసం దాదాపు రూ. 8 కోట్లతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె వి రమణాచారి, ఆలయ ఈవో గీతా తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కళ్యాణం, గదుల బుకింగ్‌ వంటివి ఇక్కడి నుంచే బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దాదాపు 1600 చదరపు గజాల విస్తీర్ణంలో సెల్లార్‌, జీ ప్లస్‌ టూ నిర్మించాలని వెల్లడించారు. మొదటి అంతస్తులో కళ్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మందికి సరిపడే భోజనశాల ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/