డిపోల ఎదుట కార్మికుల ఆందోళన

Workers Strike

Khammam: ఖమ్మం, మణుగూరు బస్సు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. రఘునాథపాలెం వద్ద బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కొత్తగూడెం డిపో వద్ద కార్మికులు, అఖిలపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తోపులాటలో మహిళా కండక్టర్‌ స్పృహతప్పి పడిపోయింది.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/