”ఇంట్లో మగరాయుళ్లు ఆగం ఆగం అయితుండ్రు”..

రోజుకు 4 గంటలు మద్యం దుకాణాలు తెరిపించండి. సోషల్ మీడియాలో మహిళలు వీడియో పోస్ట్‌

ladies posted video from nizamabad
ladies posted video from Nizamabad

Nizamabad: ఓవైపు కరోనా వ్యాప్తి ప్రభావంతో తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే..దీంతో అత్యవసర సర్వీసులు మినహా అన్నివ్యాపారాలు, దుకాణాలు మూతపడ్డాయి..

అంతేకాదు కల్లుదుకాణాలు, వైన్‌షాపులు, బార్లు మూసేసిన విషయం విదితమే..

ఇదిలా ఉంటే మరోవైపు ‘మా ఇంటాయన 24 గంటలూ ఇంటిపట్టునే ఉంటున్నాడు.. ‘మందు లేకపోవటంతో ఇంట్లో మగరాయుళ్లు ఆగం ఆగం చేస్తున్నారు.. అంటూ కొందరు మహిళలు వాపోతున్నారు..

మందు లేనికోపం ఇంట్లోవాళ్లపై చూపుతున్నారని పేర్కొన్నారు.. ఇంట్లో మహిళలు వారి చర్యలకు అల్లాడిపోతున్నామంటూ వారు శనివారం సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్‌చేశారు..

ఇంట్లో మగరాయుళ్లను సముదాయించలేకపోతున్నామని ఆ వీడియోలో మొరపెట్టుకున్నారు..

‘తాగుడు లేక మావోల్లు ఆగంఆగం అయితుండ్రు,..చెట్లు, గుట్టలు పట్టుకుని ఉరుకుతుండ్రు.. సార్‌.. జర పొద్దుగాల రెండు గంటలు పొద్దుముఖీ రెండు గంటలు జర వైన్స్‌ చాలు పెట్టుంర్రి సారూ.. మావోళ్లు నమ్మలమయితరు.. అంటూ సిఎం కెసిఆర్‌కు మొరపెట్టుకోవటం విశేషం..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/