హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident in SR nagar
Road accident in SR nagar

హైదరాబాద్‌: నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండా బైక్‌ ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. కారు చక్రాల మధ్యలో ఆమె ఇరుక్కుపోవడంతో కొంత దూరంపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అలేఖ్యను స్థానికులు హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/