మనస్థాపంతో సాఫ్ట్‌వేర్‌ యువతి ఆత్మహత్య

Woman suicide
Woman suicide

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో విషాదం జరిగింది. మాదాపూర్‌లోని గోల్డెన్‌హిల్స్‌ క్యాపిటల్‌ ఇండియా ప్రైవేట్‌ లి. కంపెనీలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి గచ్చిబౌలిలోని లేడీస్‌ హాస్టల్‌లో ఉంటుంది. అయితే బుధవారం ఆఫీసుకు వెళ్లని ఆ యువతి హాస్టల్లోని ఫ్యానుకు ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ యువతి పేరు పొగాకు హరిణిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ యువతి తన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రెండున్నర ఏళ్లుగా పని చేస్తున్నట్లు, మనస్థాపం చెందిన కారణంగానే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పనిచేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్‌తో ఆమె గడువు ముగియనున్నట్లు తెలిసింది. అయితే ఈ కారణంగా ఆమె ఉపాధి కోల్పోతాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business