ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

CEO Rajat Kumar
CEO Rajat Kumar

హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్న (గురువారం)తో ముగిసింది. దీంతో ప్రధానపార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. స్క్రూటినీ తరువాత మొత్తం 17 నియోజకవర్గాల్లో 503 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 60 మంది తమ నామినేషన్లను వాపస్ తీసుకొన్నారు. దీంతో 443 మంది లోక్‌సభ ఎన్నికల తుదిపోరులో నిలిచారు. అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 185 మంది పోటీచేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి అతి తక్కువగా 10 మంది పోటీలో ఉన్నారు. ఆ తరువాత అదిలాబాద్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు 11 మంది చొప్పున బరిలో నిలిచారు. అత్యధికంగా భువనగిరి నుంచి 10 మంది, మెదక్ నుంచి 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.. మల్కాజిగిరి, చేవెళ్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలలో ఒక్కరు చొప్పున ఉపసంహరించుకున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/