బిజెపిని గెలిపిస్తే అభివృద్ధికి ఆటంకమే: గంగుల

gangula kamalakar11
gangula kamalakar

కరీంనగర్‌: జనవరిలో జరగబోయే మున్పిపల్‌ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే అభివృద్ధి ఆటంకం కలుగుతుందని టిఆర్‌ఎస్‌ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఎలా గెలిపించారో అదే మాదిరిగానే జిల్లాలోని కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు గంగుల సూచించారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చడానికి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడున్న బిజెపి ఎంపీ బండి సంజ§్‌ు మాత్రం జిల్లా అభివృద్ధికి అడ్డు తగులుతూ..కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. ఇంకా టిఆర్‌ఎస్‌ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను కడుపులో పెట్టుకొని చూసుకుంటునన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో సీనియార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలకు స్థానం కల్పిస్తున్నామని మంత్రి గంగుల చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/