ఆర్‌టిసిని యధావిధిగా కొనసాగించడం సాధ్యం కాదు

ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్‌టిసిని ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు. జీతాలు చెల్లించడానికే రూ. 250 కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5వేల కోట్ల మేరకు అప్పులున్నాయి. ఛార్జీలు పెంచితే ప్రయాణికులు ఆదరించరు. సిఎం

CM KCR
CM KCR

హైదరాబాద్: ఆర్‌టిసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఆదిశ గా ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌టిసిని యధావిధిగా కొనసాగించడం సాధ్యం కాదని, ఇప్పటికే ఆర్‌టిసిలో అప్పులు రూ. 5వేల కోట్లకు చేరుకు న్న అంశంపై సుమారు నాలుగు గంటల పాటు చర్చించారు. ఈ క్రమంలో ఆర్‌టిసి కార్మికులు భే షరుతుగా విధుల్లోకి చేరతామని ప్రకటించిన వైనంతో పాటు ఆర్‌టిసిపై కూలంకుషంగా చర్చించా రు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌టిసి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అం శాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్ర జలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడ మే ప్రథమ కర్తవ్యంగా, ఆర్‌టిసి సమస్యలకు శా శ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. కార్మికుల సమ్మెతో ఆర్‌టిసికి వాటిల్లిన న ష్టాలు, పేరుకపోతున్న బకాయిలు, అప్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ఆర్‌టిసిని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆర్‌టిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు రూట్లపై శుక్రవారం (నేడు) హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశమున్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్‌టిసికి సంబంధించి తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దా దాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్ల నిధులు అవసరమని అధికారులు, మంత్రు లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆలాగే కార్మికుల సిసిఎస్‌కు రూ. 500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, డీజిల్ బకాయిలతో పాటు రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నట్లు సిఎంకు వివరించారు. ఆర్‌టిసిలోని 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉంటుందని, కార్మికుల పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు రూ. 6,570 కోట్ల వరకు చెల్లించాల్సి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/