లోగోతో ఉన్న క్యారీబ్యాగ్‌లను ఉచితంగా ఇవ్వాలి..లేకుంటే జ‌రిమానా!

carrying bags
carrying bags

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలనివినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం ఆదేశించింది. అయితే లోగో ముద్రించి ఉంటే ఉచితంగానే క్యారీబ్యాగ్ ఇవ్వాలని చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది. ఇందుకు విరుద్ధంగా క్యారీబ్యాగ్‌ను వినియోగదారుడికి విక్రయించిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్ మాల్‌కు రూ.ఏడువేల జరిమానా విధించింది. ఉప్పల్ నివాసి శ్రీకాంత్ గతనెల 18న షాపర్స్‌స్టాప్‌లో వస్తువులు కొనుగోలు చేయగా.. ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన క్యారీబాగ్‌కు రూ.ఐదు వసూలుచేశారు. క్యారీబ్యాగ్‌కు చార్జీ చేస్తున్నందున ఎలాంటి లోగో ముద్రించని బ్యాగ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన శ్రీకాంత్ తనకు జరిగిన అసౌకర్యాన్ని పౌరసరఫరాలభవన్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన అధికారులు షాపర్స్‌స్టాప్‌కు జరిమానా విధించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/