పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

minister-puvvada

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వానకాలం పత్తి, వరి పంటల కొనుగోలుపై ఖమ్మం డీపీఆర్సీ భవనంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వివరాలను సేకరించాలన్నారు. వచ్చే దసరా నాటికి జిల్లాలోని 229 రైతు వేదికలను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రైతువేదికల నిర్మాణంలో అలసత్వం వహించే సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎల్ రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ, డీసీఎం ఎస్ చైర్మన్లు నాగభూషణం, శేషగిరిరావు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/