త్వరలో మేనిఫేస్టోను ప్రకటిస్తాం: లక్ష్మణ్‌

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయం చేసేలా ఎన్నికల మేనిఫేస్టో రూపోందించామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు విద్యార్థులు, రైతులు తదితర వర్గాలను టీఆర్‌ఎస్‌ మోసం చేసిందని వారికి న్యాయం చేసే దిశలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రజా మేనిఫేస్టోను రూపోందించామని లక్ష్మణ్‌ వెల్లడించారు. త్వరలో మేనిఫేస్టోను ప్రకటిస్తామని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.