2023 లో టిఆర్‌ఎస్‌ను ఓడిస్తాం

Uttam Kumar
Uttam Kumar

నల్గొండ: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దేవరకొండలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి ఎప్పటికీ బలపడదన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు బిజెపి చేసిందేమీలేదని తెలిపారు. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ అసమర్థత వల్లే గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కావడంలేదన్నారు. కెసిఆర్‌ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్, జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ హాజరయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/