తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం: అశ్వత్థామరెడ్డి

Ashwathama reddy
Ashwathama reddy


హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ఆర్టీసి ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలకు ఐకాస నేతలు ఆహ్వానించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీతాల కోసం తాము సమ్మె చేయడం లేదని, ఆర్టీసిని బతికించుకోవడమే లక్ష్యమన్నారు. 7000 మంది పదవీవిరమణ పొందినా ఒక్క నియామకం కూడా జరగలేదని అశ్వర్థామరెడ్డి విమర్శించారు. అంతేకాక ఆర్టీసిపై డీజిల్‌ భారం ఎక్కువైందని, డీజిల్‌పై 27శాతం పన్ను వేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/telengana/