సిబిఐ విచారణకు సిద్ధం

Devulapally Prabhakara Rao
Devulapally Prabhakara Rao

హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అవగాహన లేక మాట్లాడుతున్నాడని ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 71 మెగా వాట్లు సోలార్ పవర్ ఉండేదని, ఇప్పుడు సోలార్ పవర్ 3600 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలతో ఎంతో పారదర్శకంగా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90 పైసలకు విద్యుత్ కొంటున్నామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే పిపిఎలు కుదుర్చుకున్నామని అనడం అవాస్తవమన్నారు. విద్యుత్ సంస్థలు పూర్తిగా స్వతంత్రమైనవని, మాపై ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లు లేవని ప్రభాకర్ రావు తెలిపారు. తమపై ఎలాంటి అనుమానాలు ఉన్న సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/