కరోనా వ్యాప్తి..అన్ని జాగ్రత్తలు తీసుకున్నం

విద్యార్ధులు మాస్కులతో హజరుకావొచ్చు

sabita indrareddy
sabita indrareddy

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షాకేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 5.60లక్షల మంది విద్యార్ధులు 2500కు పైగా పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారని, వీరంతా ఇప్పటికే పరీక్షలకు సన్నద్దం అయ్యారని ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయడం సబబు కాదని, వాయిదా వేస్తే విద్యార్ధులు ఆందోళన చెందుతారు కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలతో పరీక్షలు జరపాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారని, విద్యార్ధులు మాస్కులతో పరీక్షా కేంద్రాలకు హజరుకావొచ్చని, శుక్రవారం ఉదయం నగరంలోని బోరబండ, యూసఫ్‌గూడలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం మీడియాతో అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/