రైతులకు మేము పూర్తి మద్దతునిస్తాం

రైతులకు ఎలాండి ఇబ్బందులు కలగకుండా ధాన్యాలను కొనుగోలు చేయాలి: పొన్నం ప్రభాకర్‌

ponnam prabhakar
ponnam prabhakar

సిద్దిపేట: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు సాగించాలని, తెలంగాణ టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజి ఎంపి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రైతులకు తాము పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. గతంలో సిఎం కెసిఆర్‌ గౌరవెళ్లి, గండిపల్లి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతు.. ఇక్కడే కుర్చి వేసుకుని కూర్చోని ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానన్నాడు. కాని సిఎంకు ఇతర ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ద ఈ ప్రాజెక్టులపై లేదని విమర్శించారు. గౌరవెళ్లి , గండిపల్లి ్పజెక్టులను పూర్తి చేయించడం స్థానిక ఎమ్మెల్యే వల్ల కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఎలాండి ఇబ్బంది కలగకుండా దాన్యాలను కొనుగోలు చేయాలని. అందుకు సంబందించిన డబ్బులు కూడా వారి ఖాతాలలో త్వరగా వేయాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/