పట్నం గోస పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం

ఎర్రవల్లికి ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలి

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: పట్నం గోస పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట తప్పారని రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ మీడియా మీట్‌ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కెసిఆర్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు. సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు. ఎర్రవల్లి చింతమడకకు ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రజలను కెసిఆర్‌ మోసం చేసిన తీరును ఎందగడతామని అన్నారు. కాంట్రాక్లర్లకు 900 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి అని అన్నారు. కాంగ్రెస్‌ హయంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/