మూడు నెలల్లో మార్పు చూడబోతున్నాం

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు అవినీతిని సమూలంగా నిర్మూలించడం, ఏ మాత్రం లంచాలు ఇచ్చే అవసరం లేకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే నగర (అర్బన్‌), రెవెన్యూ, గ్రామీణ విధానాలను దృఢచిత్తంతో రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామ స్వరాజ్యం కాంక్షతో పటిష్ఠమైన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చాం. దీంతో గ్రామాల అభివృద్ధి సాగుతోంది.. మూడు నెలల్లో మార్పు చూడబోతున్నాం. ఇప్పుడు అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన పురపాలక చట్టం ఉండాలి. ప్రభుత్వం నుంచి ఉత్తమ విధానాలు రావాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, కమిషనర్‌ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, పురపాలక శాఖ మాజీ ఉన్నతాధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/