ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలి

తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి

Harish-Rao
Harish-Rao

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో ఉచిత అల్పాహార సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరమని, దిశపై అఘాయిత్యం ఘటన ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకునే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని, మగపిల్లలకు సంస్కారంతో కూడిన విద్య నందించాలని అన్నారు. ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలని, వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాలను గమనిస్తూ వుండాలని తల్లిదండ్రులకు సూచించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/